మేము ఎవరము ? మా గురించి
ABOUT US
స్వాగతం ఎస్ ఎస్ జేమ్స్ అండ్ రుద్రాక్ష
ఎస్ ఎస్ జేమ్స్ అండ్ రుద్రాక్షను 1991 లో మిస్టర్ శ్రీనివాస చారి ముసలోజు హైదరాబాద్లో స్థాపించారు {అధికారికంగా ఉన్న సంస్థ శ్రీ శ్రీనివాస జ్యువెలరీ వర్క్స్ అండ్ సేల్స్}. మేము భారతదేశంలో లభించే రత్నాలతో పాటు ప్రపంచ దేశాలలో లభించే ఉత్తమమైన జాతి నవరత్నాలలో జ్యోతిష్య సిద్ధాంత ప్రకారంగా ఉన్న రత్నాలను మాత్రమే సేకరించి మా ఎస్ ఎస్ జేమ్స్ అండ్ రుద్రాక్ష సంస్థలో మరి యొక్క మారు రత్న శాస్త్రం గురించి పూర్తిగా తెలిసినవారు రత్నాలన్నింటిని పరీక్షించిన అనంతరము. ప్రభుత్వం దృవీకరించిన జెమ్ ల్యాబరేటరీ సంస్థలో సర్టిఫికేషన్ పొందిన మా రత్నాలను కొనుగోలు చేసి ధరించిన మా కస్టమర్స్ అందరూ మంచి ప్రయోజనాలు పొందారని మేము ఎంతో గర్విస్తున్నాము,
మేము భారీ వైవిధ్యభరితమైన రత్నాల సేకరణలో భారతదేశంలో అతిపెద్ద శ్రేణిలో ఒకటిగా ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. జాతి నవరత్నాల సేకరణలో వందలాది నాణ్యమైన మరియు విలువైనవి. కెంపు, స్టార్ కెంపు, కేసీ ముత్యాము, సౌత్ సీ ముత్యాము, పగడము, జపాన్ పగడం, గణపతి పగడము, పచ్చ, గరుడ పచ్చ, పుష్యరాగము, కనకపుష్యరాగం, సిలోన్ కనకపుష్యరాగము, వజ్రము, క్యూబిక్ జిర్కోనియా (CZ), నీలము, ఇంద్రనీలము, సిలోన్ నీలము, గోమేధికము, సిలోన్ గోమేధికము, వైడూర్యము, కృష్ణవైఢూర్యం, అమెథిస్ట్, హకిక్ స్టోన్స్, వంటి మొదలైన రత్నలు మరియు మా కస్టమర్ ఆవశ్యకత తీర్చడానికి వివిధ క్యారెట్లలలో వివిధ ఆకారాలలో మా సంస్థలో రత్నాలు అంధుబాటులో ఉన్నాయి,

మా వర్క్ షాప్
మేము ప్రొఫెషనల్ గా జ్యువెలరీ డిజైనర్, హైదరాబాద్ ఇండియాలో వివిధ రకాల ఆభరణాల తయారీలో 32+ సంవత్సరాల అనుభవం గలవారము. మా వర్క్ షాప్ ప్రారంభ సమయము ఉదయం 10.00 నుండి రాత్రి 9.00 వరకు
Hyderabad
1-7-206/GF/A1, S.S.Enclave,
Kamalanagar, ECIL
Phone: +91-9848237182
Secunderabad
5-11-8/b, H.B.Colony,
NFC road, Meerpet, Moula-Ali,
Phone: +91-9393237182
మా వర్క్ షాప్ లో వివాహ ఆభరణాల కోసం మాకు ప్రత్యేక సాంప్రదాయ భారతీయ ఆభరణాల రూపకల్పన బృందం ఉంది. మేము విశ్వబ్రాహ్మణులము అనగా కంసాలి వృత్తి చేసే వాళ్లము ఈ వృత్తిలో మా ముసలోజు వంశస్థులు 150+ సంవత్సరాల నుండి మా ముత్తాత కీ.శే బాలకృష్ణ చారి గారు మా తాతగారు కీ.శే నరసింహ చారి గారు ప్రస్తుతం మేము (శ్రీనివాసచారి) స్వర్ణకార వృత్తి తోపాటు పంచాంగ (జ్యోతిష్య) అనుభవముతో జాతి రత్న ఉంగరములను శుభముహూర్తంలో మా వర్క్ షాప్ లో చేసినా జాతి రత్న ఉంగరములు అద్భుత శక్తీ సామర్ధ్యములు కలదై కోరిన కోర్కెలను కల్పవృక్షం వలె అభీష్టసిద్ధిని కలిగించు ప్రభావం మేము చేసిన ఉంగరమునందు ఉంటుంది.


ISO 9001:2015
ISO Certification For SS Gems And Rudraksha
ఎస్ఎస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష ISO 9001: 2015 సర్టిఫైడ్ రత్నాలు మరియు రుద్రాక్షల యొక్క ట్రేడింగ్ మరియు ఆభరణాల జ్యువెలరీ డిజైనర్ సంస్థ, అన్ని రత్నాలు ప్రొఫెషనల్ జియాలజిస్టులతో ల్యాబ్ సర్టిఫికేషన్ చేసిన రత్నాలను వినియోగదారులకు ISO 9001: 2015 తో నాణ్యమైన 100% సహజసిద్దమైన రత్నాలను అందించడానికి మా కంపెనీ కట్టుబడి ఉంది.
- మా వ్యాపారం యొక్క కస్టమర్ సంతృప్తిని తీర్చగల ఉత్పత్తుల నాణ్యతకు హామీ అందించే సామర్థ్యం..
- అంతర్జాతీయ ప్రమాణం యొక్క వివిధ నాణ్యత నిర్వహణ వ్యవస్థల నిర్మాణంలో ఏకరూపత..
- వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు అందించడం..
- అంతర్జాతీయ ప్రమాణం యొక్క అవసరాలకు అనుగుణంగా మా సంస్థ నిర్వహించబడుతుంది.
- అంతర్జాతీయ ప్రామాణిక ప్రక్రియను అనుసరిస్తూ కస్టమర్ల అవసరాలకు తగినట్టుగా ఉత్పత్తులను అందిస్తాము.
- క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ మేనేజ్మెంట్ మరియు నాణ్యత నిర్వహణ సూత్రాల వ్యవస్థను స్థిరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక వ్యూహాత్మక నిర్ణయంతో మా సంస్థ అంతర్జాతీయ ప్రమాణం ఆధారంగా నిర్వహించబడుతుంది.
ఎస్ఎస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష అంతర్జాతీయ ప్రమాణాలకు నాణ్యత నిబద్ధత కారణంగా. మేము ISO 9001: 2015 నుండి ప్రశంసల పత్రాన్ని సాధించాము.

