గోమేదికం రత్నాలలో ధరల తేడాలు ఎంధుకు ఉంటాయి ?
గోమేదికం రత్నాలలో ధరల తేడాలు ఎంధుకు ఉంటాయి ? గోమేదికం రత్నాలు కొనేముందు ధరను గుర్తించడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ రోజు మీకు వివరంగా వివరిస్తున్నాను, మార్కెట్లో గోమేదికం రత్నాము యొక్క క్వాలిటీని బట్టి ధర నిర్ణయించ బడుతుంది, గోమేదికం రత్నామును కొనేవారు ధరను గుర్తించడంలో చాలామంది ఇబ్బందిపడుతుంటారు అందుకే ఈ వీడియో మీకోసం.
మొదటిగా భూగర్భలో గోమేదికం రత్నాలు చాలా ప్రాంతాలలో లభిస్తాయి. కొన్ని భూ పొరల్లో ఎదుగుదలను బట్టి లభించే రత్నాలు చాలా మంచి కలర్ ఫుల్ గా ఉండి మంచి కాంతి రేఖలు వెదజల్లుతూ ప్రకాశవంతంగా ఉంటవి. కాంతిగా ఉన్న రత్నాలు ధర అధికంగా ఉంటుంది. దీనిని మీరు గుర్తించాలి. మరియు కొన్ని రత్నాలు అదే భూగర్భంలో వెలసి పోయినట్లుగా అనగా మబ్బుగా ప్రకాశ హీనంగా లభించును, అ రత్నాలు ధర తక్కువగా ఉంటుంది. కాంతి తక్కువగా ఉండే గోమేదికం రత్నాములు ధర తక్కువగా ఉంటాయి, ఇది మీరు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా రత్నం యొక్క క్వాలిటీని బట్టి ధరని గుర్తించవచ్చు.
రెండవది గోమేదికం యొక్క స్టోన్ తూకాన్ని క్యారెట్లలో పిలుస్తారు ఈ గోమేదికం రత్నాము ఎంత పెద్దదిగా ఉంటే ఆ గోమేదికం యొక్క ధర అంత ఎక్కువగా ఉంటుంది, ఎందుకనగా భూగర్భంలో గోమేదికలు చాలా వరకు చిన్న చిన్నవిగా ఎక్కువగా లభిస్తాయి, పెద్దవిగా దొరికే గోమేదికలు చాలా వరకు తక్కువగా లభిస్తాయి. అందుచే ఎక్కువ క్యారెట్ల బరువు ఉన్న గోమేదికలు ధర ఎక్కువగా పలుకుతుంది. మీరు ఇది కూడా ముఖ్యంగా గమనించవలెను,
మూడవది గోమేదికలు యొక్క కటింగ్ రత్నాముపై ఇష్టాంసారంగా ఉండరాదు. దానివలన ఆభరణాలలో గోమేదికలు బిగించడానికి అనువుగా లేక రత్నాలు ఆభరణాలలో నుండి ఉడి పడిపోయే అవకాశం ఉంది. అనగా రత్న శాస్త్రంలో తెలిపినట్లుగానే రత్నం కటింగు ఉండాలి. ఇలాంటివి ధరించినప్పుడు ప్రయోజనకరంతో పాటు మనము ధరించే ఆభరణాలు అందంగా ఉంటాయి.
నాలుగవది జ్యోతిష్య సిద్ధాంత ప్రకారంగా గోమేదికలు దోషాలు లేనటువంటివి కొన్ని ధరించవలెను. ఈ నాలుగు పాయింట్ల పైన గోమేదికం యొక్క ధర ఆధారపడి ఉంటుంది. వ్యత్యాసాల గల రత్నాలు మనకు భూగర్భంలో లభిస్తాయి. ఇంకను మీకు క్షుణ్నంగా ధర వ్యత్యాసాల గురించి మా ఎస్ ఎస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష సంస్థలో మీకు కావలసిన రత్నాలను చూపుతూ మీకు ధరలలో వ్యత్యాసాల గురించి మా సంస్థలో క్షుణ్నంగా చెప్పబడును.